Lyrks
Lyrks
Lyrks
Cover Art

Inkem Inkem Kaavale Lyrics by Sid Sriram

Geetha Govindam

2018

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తధీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ 'గీత గోవిందం'
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
చాలే ఇది చాలే...
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాళ్ళే...
గుండెల్లోన వేగం పెంచావే...
గుమ్మంలోకి హోలీ తెచ్చావే...
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...
నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే...
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
చాలే ఇది చాలే...
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాళ్ళే...
తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తధీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ 'గీత గోవిందం'
ఊహలకు దొరకని సొగసా...
ఊపిరిని వదలని గొలుసా...
నీకు ముడిపడినది తెలుసా...
మనసున ప్రతి కొస...
నీ కనుల మెరుపుల వరస...
రేపినది వయసున రభస...
నా చిలిపి కలలకు బహుశా...
ఇది వెలుగుల దశ...
నీ ఎదుట నిలబడు చనువే వీసా...
అందుకుని గగనపు కొనలే చూశా...
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
చాలే ఇది చాలే...
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాళ్ళే...
మాయలకు కదలని మగువా...
మాటలకు కరగని మధువా...
పంతములు విడువని బిగువా...
జరిగినదడగవా?
నా కథని తెలుపుట సులువా?
జాలిపడి నిమిషము వినవా?
ఎందుకని ఘడికొక గొడవ?
చెలిమిగ మెలగవా...
నా పేరు తలచితే ఉబికే లావా...
చల్లబడి నను నువు కరుణించేవా?
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
చాలే ఇది చాలే...
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాళ్ళే...
గుండెల్లోనా వేగం పెంచావే...
గుమ్మంలోకి హోలీ తెచ్చావే...
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...
నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే...
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
చాలే ఇది చాలే...
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాళ్ళే...
తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తధీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ 'గీత గోవిందం'
Credits

About “Inkem Inkem Kaavale” by Sid Sriram

Read the complete lyrics to "Inkem Inkem Kaavale" by Sid Sriram from the album "Geetha Govindam" in 2018. On Lyrks you can follow along with the full text, explore the artist's discography, and discover related songs.

"Inkem Inkem Kaavale" is performed by Sid Sriram. from the album "Geetha Govindam" in 2018 This page provides the full lyric text for fans who want to sing along, study the songwriting, or compare versions across releases. Lyrks organizes lyrics by artist and song slug so you can bookmark and share a stable URL. Music lyrics help listeners connect with emotion, narrative, and rhythm in a track. Whether you are learning English, researching a favorite chorus, or preparing for karaoke, having accurate line breaks and section labels (verse, chorus, bridge) makes the experience easier. We link to the official artist profile on Lyrks where available, including biography snippets, top songs, and chart placements when we have that data. If you enjoy "Inkem Inkem Kaavale", explore more songs by Sid Sriram using the links below. Chart and trending pages on Lyrks highlight what listeners are searching for this week. For copyright or correction requests, see our DMCA and contact pages.

View all songs and biography for Sid Sriram · Trending lyrics · Billboard Hot 100

Frequently asked questions

"Inkem Inkem Kaavale" is credited to Sid Sriram. Songwriting credits may include additional writers listed on the release; check the credits section on this page for linked collaborators.

"Inkem Inkem Kaavale" appears on "Geetha Govindam" in 2018.

Visit the Sid Sriram artist page at /artist/sid-sriram for biography, popular tracks, and links to more lyric pages.